న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరుగుతున్న నాలుగవ టీ20లో భారత్ నిర్ణత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. మనీష్ పాండే అత్యధికంగా 50 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 36 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో మనీష్‌కు ఇది మూడవ అర్థసెంచరీ కావడం విశేషం. ఓపెనర్ రాహుల్ 39 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ కోసం ఇండియా జట్టు మూడు మార్పులను చేసింది. తొలుత న్యూజిలాండ్ టాస్ గెలిచి భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. భుజం గాయం కారణంగా విలియమ్సన్ విశ్రాంతి తీసుకోవడంతో కెప్టెన్ బాధ్యతలు సౌథీకి దక్కాయి. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి పరువు దక్కించుకోవాలని బ్లాక్ క్యాప్స్ భావిస్తుండగా, క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ప్రణాళికలు వేస్తుంది. భారత్ విషయానికి వస్తే రోహిత్, షమీ, జడేజా స్థానంలో సంజూ శాంసన్, సైనీ, వాషింగ్టన్ సుందర్ టీంలోకి చేరారు. కివీస్ టీంలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. విలియమ్సన్, డీ గ్రాండ్‌హోమ్ స్థానంలో టామ్ బ్రూస్, డరైల్ మిచెల్ జట్టులో చేరారు.
కివీస్ టార్గెట్ 166