రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. రాజేంద్రనగర్ ఆర్.డీ.ఓ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ ను విసిరారు. బొంబాయ్ లోని అల్ట్రాటెక్ సంస్ట కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ రెగులపాటి రామ్మోహన్, అర్.డీ.ఓ చంద్ర కళ, రంగారెడ్డి జిల్లా ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టరు వెంకటేశ్ లకు కలెక్టర్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. అనంతరం కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తప్పని సరిగా మొక్కలు నాటాలన్నారు. గత 100 ఏళ్లుగా క్షీణిస్టున్న వృక్ష సంపద గ్రీన్ కవరేజ్ పెంచడానికి ప్రతీ ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కలెక్టర్ హరీష్